ఉప్పెన రీమేక్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో కొడుకు

టాలీవుడ్ లో మాదిరిగానే కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల వారసుల ఎంట్రీ ఇప్పుడు వరుసగా జరుగుతుంది.కమల్ హసన్ ఫ్యామిలీ నుంచి అతని ఇద్దరు కూతుళ్ళు హీరోయిన్స్ గా తెరంగేట్రం చేసేశారు.

 Vijay's Son Jason To Star In Uppena Tamil Remake, Tollywood, Kollywood, Star Her-TeluguStop.com

అలాగే చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ కూడా అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు తండ్రితో కలిసి సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు మరో వారసుడు తెరంగేట్రంకి రంగం సిద్ధం అవుతుంది.

ఇళయదళపతి విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే కెనడా వెళ్ళిపోయి యాక్టింగ్ శిక్షణ తీసుకోవడంతో పాటు, డాన్స్, స్టంట్స్ లో ప్రావీణ్యం సంపాదించాడు.18 ఏళ్ల సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కావాల్సిన కథ కోసం హీరో విజయ్ జల్లెడ పడుతున్నాడు.యూత్ ఫుల్ స్టొరీతో పాటి మాస్ ఎలివేషన్ ఉండే విధంగా కథ ఉండాలని భావిస్తున్న విజయ్ ఆ తరహా కథల కోసం ఇప్పటికే తమిళ్ దర్శకులు చెప్పిన స్టొరీ లైన్స్ వింటున్నాడు.

అయితే కొడుకు గ్రాండ్ ఎంట్రీకి కావాల్సిన సబ్జెక్టు ఇప్పటి వరకు దొరకలేదని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయిన ఉప్పెన సినిమా మీద విజయ్ దృష్టి పడిందని టాక్.

ఇప్పటికే ఈ సినిమా తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మాస్ ఎలిమెంట్స్ పక్కాగా ఉండటం, దానికి తగ్గ విలనిజం కూడా సినిమాలో ఉండటంతో పాటు తమిళ్ నేటివిటీకి దగ్గరగా సినిమా కథాంశం ఉండటంతో విజయ్ కనెక్ట్ అయ్యాడు.దీంతో ఉప్పెన సినిమాని తమిళ్ లో సంజయ్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

త్వరలో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube