ఓటిటిలో రిలీజ్ కు రెడీ అవుతున్న విజయ్ బీస్ట్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

 Vijay's 'beast' To Release On Ott In May 11 Th, Thalapathy Vijay, Beast, Nelson-TeluguStop.com

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.

ఇక ఇప్పుడు ఈయన బీస్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి రిలీజ్ కు కూడా రెడీగా ఉంచారు.ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.

Telugu Beast, Pooja Hegde-Movie

అనిరుద్ సంగీతం అంధించిన ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి.అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది.ఒక్క తమిళ్ లో మాత్రం కాస్త పరవాలేదు అనిపించు కుంది కానీ మిగతా రిలీజ్ అయినా అన్ని ఏరియాల్లో భారీ ప్లాప్ అయ్యింది.

కెజిఎఫ్ రిలీజ్ కూడా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ఒక కారణం.అయితే ఈ సినిమా థియేటర్స్ లో రన్ పూర్తి అవ్వడంతో ఇక ఓటిటి లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఓటిటి రిలీజ్ కి డేట్ కూడా ఫిక్స్ చేసారు.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ బీస్ట్ ను మే 11 నుండి స్ట్రీమింగ్ కి పెట్టనుంది.

దీంతో పాటు సన్ నెక్ట్స్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube