పవన్ కళ్యాణ్ కోసం అద్భుతమైన కథ రాస్తా అంటున్న బాహుబలి రచయిత  

Vijayendraprasad Interested To Writer Story For Pawan Kalyan - Telugu South Cinema, Telugu Cinema, Tollywood,

టాలీవుడ్ లో స్టార్ రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని విజయేంద్రప్రసాద్ సొంతం చేసుకున్నారు.బాహుబలి సినిమాతో పాన్ స్టార్ రైటర్ గా మారిపోయిన విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ సినిమాలకి సైతం కథలు అందిస్తున్నారు.

 Vijayendraprasad Interested To Writer Story For Pawan Kalyan

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి కథ అందిస్తున్న ఈ స్టార్ రైటర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే చూడాలని చాలా మంది పవన్ ఫాన్స్ కోరుకుంటున్నారు.అదిరిపోయే పొలిటికల్ స్టొరీని పవన్ కళ్యాణ్ కోసం తయారు చేయాలని అతనిని కూడా చాలా మంది అడుగుతున్నారు.

ఇదే విషయంపై తాజాగా ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ని ప్రశ్న ఎదురైంది.దీనిపై ఆయన స్పందిస్తూ

పవన్ కళ్యాణ్ కోసం అద్భుతమైన కథ రాస్తా అంటున్న బాహుబలి రచయిత-Movie-Telugu Tollywood Photo Image

పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.

ఎందుకంటే తను మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తాడు.ఏం ఆలోచిస్తే అదే చెప్తాడు.

తాను ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా చేస్తాడు.అతని సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినట్టు నేను సంతోషపెడతాను.

అతనిలో నటన ప్రతిభ, దర్శకత్వ నైపుణ్యం సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో తనకు ప్రతిభ ఉంది.కానీ అతని సినిమా కథలు బాగోలేకపోవడంతో అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ జానీ సినిమా చాలా చక్కగా రాశారు.కానీ ప్రేక్షకులు ఎవరు ఆ సినిమా అంతగా ఆదరించలేదు.

అదే ఒక ప్రముఖ రచయిత జానీ సినిమాకి కథ అందించినట్లయితే వేరేలా ఉండేది.ఒకవేళ అవకాశం వస్తే అతనికి బ్రహ్మాండమైన కథ రాస్తాను అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు.

మరి వీరి కలయికలో సినిమా చేయడానికి ఏ దర్శకుడు అయిన ఆసక్తి చూపిస్తాడెమో చూడాలి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test