ఎవరికీ తెలియని సీత గురించి చెప్పబోతున్న స్టార్ రైటర్

బాహుబలి సినిమాతో స్టార్ రచయితగా ఆల్ ఓవర్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్.విజయేంద్ర ప్రసాద్ రచయితగా టాలీవుడ్ లో సుదీర్ఘకాలం నుంచి ఉన్నా కూడా రాజమౌళి సినిమాల ద్వారానే అతను లైమ్ లైట్ లోకి వచ్చారని చెప్పాలి.

 Vijayendra Prasad To Script Sita The Incarnation-TeluguStop.com

రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నింటికి ఎక్కువగా కథ అందించేది విజయేంద్రప్రసాద్ కావడం విశేషం.ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత కంగనా రనౌత్ మణికర్ణిక సినిమాకి, అలాగే సల్మాన్ ఖాన్ బజరంగి సినిమాకి హిందీలో విజయేంద్ర ప్రసాద్ కథలు అందించాడు.

ఈ రెండు సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో విజయేంద్ర ప్రసాద్ కథలకి డిమాండ్ పెరిగింది.

 Vijayendra Prasad To Script Sita The Incarnation-ఎవరికీ తెలియని సీత గురించి చెప్పబోతున్న స్టార్ రైటర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కొడుకు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ నే కథ అందించారు.అలాగే కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో తెరకెక్కనున్న మరో ఫిమేల్ క్వీన్ మహారాణి దిడ్డాకి ఇతనే కథ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అందరికి తెలిసిన రామాయణంలోని సీత పాత్రని మెయిన్ సెంట్రిక్ గా చేసుకొని బాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతుంది.తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సీత: ది ఇన్కారినేషన్ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.అయితే సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు.

కాని ఈ సినిమాకి కథని విజయేంద్రప్రసాద్ అందించారు.ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

#Sita- #Pan India Movie #DirectorAlaukik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు