ఛత్రపతి రీమేక్ కథ బాధ్యతలు విజయేంద్రప్రసాద్ చేతికి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఛత్రపతి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో ఒక మైలురాయి సినిమాగా నిలిచిపోయింది.

 Vijayendra Prasad Re-writing Script For Bellamkonda, Tollywood, Bollywood, Telug-TeluguStop.com

ఇప్పుడు ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.ఎప్పటి నుంచో హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ దానికోసం ఛత్రపతి సినిమాని ఎంపిక చేసుకున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారు.

అయితే సినిమా కథలో నార్త్ ఇండియా నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో కథ పరంగా మార్పులు చేయడం కోసం ఒరిజినల్ కథ రాసిన విజయేంద్రప్రసాద్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ బాధ్యతలని విజయేంద్రప్రసాద్ కి అప్పగించినట్లు తెలుస్తుంది.ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో కథలో మార్పులు చేస్తారని తెలుస్తోంది.అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీగా ప్రెజెంట్ నేటివిటీకి తగ్గట్లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ని బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా తీసుకోవాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ హీరో ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమా పూర్తి కాగానే ఛత్రపతి రీమేక్మీద దృష్టిపెడతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube