పుష్ప సినిమా చూసి వణికిపోయా.. షాకింగ్ కామెంట్స్ చేసిన విజయేంద్ర ప్రసాద్!

తెలుగులో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, బాహుబలి, లాంటి సినిమాలు విడుదల అయి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికి తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాలో బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ కలెక్షన్లను రాబట్టాయి.

 Vijayendra Prasad Interesting Comments On Puspha Movie, Vijayendra Prasad, Raja-TeluguStop.com

ఇకపోతే తాజాగా విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తు దూసుకుపోతోంది.బహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది.

ఇక బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని తలెత్తుకునే విధంగా చేశాడు దర్శకుడు రాజమౌళి.

ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విషయం అందరికి తెలిసిందే.

బాహుబలి సినిమా తో రాజమౌళి క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.అయితే రాజమౌళికి ఏ సక్సెస్ అందినా కూడా అందులో సగభాగం అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు దక్కుతుంది అని చెప్పవచ్చు.

ఎందుకంటే రాజమౌళి విజయం వెనుక తండ్రి విజయేంద్ర ప్రసాద్ హస్తం తప్పకుండా ఉంటుంది.అంతేకాకుండా రాజమౌళి సినిమాల విషయంలో ముఖ్య పాత్ర పోషించేది విజయేంద్ర ప్రసాద్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Telugu Pushpa, Raja Mouli-Movie

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ పలు ఆసక్తికర ఈ విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.ఒక రచయితది ఒక్కొక్క శైలిలో రచన ఉంటుంది.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అంటే నాకు చాలా ఇష్టం.కథను చెప్పడంలో సుకుమార్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది అని తెలిపాడు విజయప్రసాద్.అంటే నాకు గౌరవం అని తెలిపారు.

సుకుమార్ తాజాగా తెరకెక్కించిన పుష్ప సినిమాను చూసి నేను వణికిపోయాను, ఆ సినిమా నన్ను బాగా ఆకట్టుకుంది అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.అంతేకాకుండా సుకుమార్ మూవీ టు మూవీ కథలో కొత్తదనం ఉంటుంది అని తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube