రాజమౌళి బలాదూర్ గా తిరిగేవాడు.. జక్కన్న గుట్టు విప్పిన తండ్రి..?

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దేశంలోనే సక్సెస్ పర్సంటేజ్ పరంగా రాజమౌళి నంబర్ 1 డైరెక్టర్ గా ఉన్నారు.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.

 Vijayendra Prasad Interesting Comments About His Son Director Ss Rajamouli, Alit-TeluguStop.com

అయితే రాజమౌళి బలాదూర్ గా తిరిగేవాడంటూ ప్రముఖ రచయిత, దర్శకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరైన విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గుట్టు విప్పడంతో పాటు కీలక విషయాలను వెల్లడించారు.

రాజమౌళి కుటుంబం ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినప్పటికీ ఒక సినిమా మధ్యలో ఆగిపోవడంతో ఇబ్బందులు పడింది.ఆ తరువాత కీరవాణి కృషి చేసి మళ్లీ ఆ కుటుంబ సమస్యలను తీర్చారు.

ఇంటర్ తరువాత రాజమౌళిని డిగ్రీ చదివించాలనుకున్నానని ఆర్థిక ఇబ్బందుల వల్ల వీలు కాలేదని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

తాను ఏమవుతావని అడిగితే రాజమౌళి డైరెక్టర్ అవుతానని చెప్పడంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ లో చేర్పించానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

Telugu Alito Saradaga, Raghavendra Rao, Rajamouli, Top Tollywood-Movie

ఆ తరువాత రాజమౌళి సంగీతంపై పట్టు సాధించడంతో పాటు తన దగ్గర నుంచి కథలు రాయడం కూడా నేర్చుకున్నాడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.ఆ తరువాత రాజమౌళికి రాఘవేంద్రరావు టీడీపీకి యాడ్స్ చేసే ఛాన్స్ ఇచ్చారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఆ యాడ్స్ ను రాజమౌళి బాగా చేయడంతో రాఘవేంద్రరావు శాంతినివాసం సీరియల్ ను డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Telugu Alito Saradaga, Raghavendra Rao, Rajamouli, Top Tollywood-Movie

తన కొడుకు ప్రస్తుతం తనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని రాజమౌళి స్థాయికి ఎప్పుడు ఎదుగుతానని తనకు అనిపిస్తోందని విజయేంద్రప్రసాద్ తెలిపారు.విజయేంద్ర ప్రసాద్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి తండ్రిని మించిన తనయునిగా ఎదగడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube