మరోసారి దర్శకుడుగా రాబోతున్న బాహుబలి రచయిత

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం భాగా మార్మోగుతున్న పేరు విజయేంద్ర ప్రసాద్. బాహుబలి సినిమాతో రచయిత అతని బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఆ సినిమా తర్వాత మణికర్ణిక, బజరంగీ భాయ్ జాన్ సినిమాతో హిందీలో కూడా తన పేరు వినిపించేలా చేసుకున్నాడు.ఇంత సక్సెస్ ఫుల్ రైటర్ గా ఉన్న విజయేంద్ర ప్రసాద్ కథలతోనే రాజమౌళి వరుస హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు.

తండ్రి ఆలోచనకి కొడుకు క్రియేటివిటీ తోడైతే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో అనేది వీరిద్దరు చూపిస్తున్నారు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఈ కాంబో దేశం మొత్తం వినిపిస్తుంది.

ఆయన అందించిన సినిమా కథలు అన్ని చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ అయినవే.అయితే రచయితగా వరుస సక్సెస్ లు అందుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ దర్శకుడుగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.

Advertisement

అర్ధాంగి అనే సినిమాతో మొదటి సారి దర్శకుడుగా పరిచయం అయ్యి డిజాస్టర్ కొట్టిన ఇతను ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేస్తే అందులో రాజన్న ఒకటే పరవాలేదని అనిపించుకుంది.చివరిగా శ్రీవల్లి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీసి రైటర్ గా సక్సెస్ అయ్యి దర్శకుడుగా ఫెయిల్ అయ్యారు.

అయితే మళ్ళీ దర్శకుడు సినిమా తీసి సక్సెస్ కొట్టాలని విజయేంద్రప్రసాద్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.త‌న రైటింగ్ టీంతో క‌లిసి ఆయ‌న ఓ కొత్త క‌థ త‌యారు చేశార‌ట‌.

ఆయ‌న‌కు నిర్మాత కూడా దొరికార‌ని లాక్ డౌన్ త‌ర్వాత ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అంటున్నారు.ఇది కూడా ప్రయోగాత్మక కథతోనే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

నాగ చైతన్య విషయం లో ఎక్కడ తేడా కొడుతుంది...
Advertisement

తాజా వార్తలు