విజయ్‌ దేవరకొండకు పెళ్లంటే భయం, అలాంటి అమ్మాయి అయితే ఓకేనట!

విజయ్‌ దేవరకొండ.ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్‌లో మోస్ట్‌ క్రేజీ వాంటెడ్‌ పేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Vijaydevarakondafearabout Thatkind Of Wife-TeluguStop.com

ఎందుకంటే చిరంజీవిలా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సొంత కష్టంతో విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వచ్చి ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ స్టార్‌ హీరో అయ్యాడు.ఈయన యంగ్‌ మెగా స్టార్‌ అన్నట్లుగా గుర్తింపు దక్కించుకున్నాడు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఆ సినిమా విడుదలకు ముందే నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Telugu Baba Baskar, Biggboss, Rahul Sipligunj, Shiva Jyothi, Varun-

 

మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల కోసం నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో సందడి చేశాడు.ఆ సమయంలో వరుణ్‌ సందేశ్‌తో మాట్లాడుతూ మీ మిసెస్‌ లేకుండా ఎలా ఉంటున్నారని ప్రశ్నించాడు.భార్యతో ఉండటం బాగానే ఉంటుంది కాని మరీ ఎప్పుడు కలిసి ఉండటం అంటే సాధ్యమేనా అంటూ ప్రశ్నించాడు.నాకు పెళ్లి అంటే భయం అని ఆమెకు ఎక్కువ సమయం కేటాయించడం, ఎప్పుడు ఒకే చోట ఉండాల్సి రావడం అనేది నాకు నచ్చని విషయం అంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Telugu Baba Baskar, Biggboss, Rahul Sipligunj, Shiva Jyothi, Varun-

  విజయ్‌ దేవరకొండ పెళ్లి అంటే భయం అన్నప్పుడు నాగార్జున కల్పించుకుని తప్పకుండా పెళ్లి చేసుకోవాలి.అదో మంచి ఎక్స్‌పీరియన్స్‌ అంటూ చెప్పినప్పుడు విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ అమల గారు వంటి అమ్మాయి లభిస్తే చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.అమలా గారు మిమ్ములను అర్థం చేసుకున్నట్లుగా నన్ను నేను చేసుకునే అమ్మాయి అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నట్లుగా చెప్పాడు.అప్పుడు నాగార్జున మాట్లాడుతూ నీకు త్వరలో నీ అమల దొరకాలని ఆశీర్వదిస్తున్నాను.

ఆశిస్తున్నాను అన్నాడు.మొత్తానికి విజయ్‌ దేవరకొండ పెళ్లికి కాస్త భయపడుతున్నాడని.

ఇప్పట్లో ఈయన పెళ్లి చేసుకునే ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube