ఓరి దేవుడా: యూట్యూబ్ చూసి ఏకంగా దొంగనోట్ల ప్రింటింగ్.. చివరకు ఎంత సంపాదించాడంటే..?!

సోషల్ మీడియా వలన ఎంత ఉపయోగం ఉందో మన అందరికి తెలిసిందే.కానీ.

 Vijayawada Police Arrested Fake Currency Printing From Youtube Videos Group , Yo-TeluguStop.com

, కొందరు వ్యక్తులు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి తప్పుదోవ పడుతున్నారు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.యూట్యూబ్ గురించి తెలియని వారు ఉండరు.

అయితే ఆ యూట్యూబ్ లో ఎవరో పోస్ట్ చేసిన ఒక దొంగనోట్ల తయారీ విధానం ఎలా.? అనే వీడియోను చూసి కొంతమంది దొంగనోట్లు తయారు చేసి వాటిని అమాయకపు ప్రజలకు అంటకడుతున్నారు.ఈ విషయం పసిగట్టిన విజయవాడ పోలీసులు రంగంలోకి దిగి ఆ ముఠా యొక్క గుట్టు రట్టు చేసి అరెస్ట్ చేశారు.అసలు వివరాల్లోకి వెళితే.తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దొంగ నోట్ల మూలాలు కనుగొన్నారు పోలీసులు.ఈ దొంగ నోట్ల స్కామ్ లో అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు విచారించగా అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు.

దొంగ నోట్లు ఎలా తయారు చేసావని అడగగా.యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లను తయారు చేశానని అతడు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

అంతేకాదు తాను వడ్డీ వ్యాపారం చేస్తానని అలా వడ్డీకి తిప్పే డబ్బులలో కొన్ని దొంగ నోట్లు పెట్టి నోట్ల మార్పిడి చేస్తా అని, ఆ విధంగానే తాను భారీగా సంపాదించి కోటీశ్వరుడుని అయ్యానని తెలపడంతో పోలీసులు అవాక్కయ్యారు.అసలు ఈ దొంగ నోట్ల ముఠా గురించి పోలీసులకు ఎలా అనుమానం వచ్చిందంటే.

Telugu Currency, Vijayawada, Latest, Youtube-Latest News - Telugu

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గత నెల 23న దూలం సాయి, గొట్టిముక్కల రవిశరన్‌, భీమవరపు యజ్ఞప్రదీప్‌, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర కొన్ని దొంగనోట్లు లభించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేశారు.అయితే అసలు వీళ్ళకి ఈ దొంగనోట్లు ఎక్కడ నుంచి వచ్చియో అనే వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తిలో ఈ దందా నడుస్తుందని కనుగొన్నారు.నిందితుల చెప్పిన వివరాల ప్రకారం.అనపర్తిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అతడి ద్వారా అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Telugu Currency, Vijayawada, Latest, Youtube-Latest News - Telugu

దొంగనోట్లు వీళ్ళు ఎలా ముద్రించేవారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది తెలుసా.ఒక సాధారణ తెల్లటి పేపర్‌పై రూ.200, 500 నోట్లను రెండు వైపులా అంటించి ముద్రించేవారట.తర్వాత అసలు నోట్ల మాదిరిగానే తేడాలు లేకుండా కట్‌ చేసి వాటిని శుభలేఖల పేపర్‌ పై నిజమైన నోట్ల మాదిరిగా ముద్రించేవారట.అలాగే ఈ దొంగనోట్లను కృష్ణ రెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ వాటిని మార్చేవాడట.

ఇతనితో పాటు అనపర్తి పెట్రోల్‌ బంకులో పని చేసే వ్యక్తికి కమీషన్‌ ఇచ్చి నోట్ల మార్పిడి చేశానని వెల్లడించాడు.కృష్ణారెడ్డి దొంగనోట్ల మార్పిడిని రెండేళ్ల నుంచి చేస్తు ఇప్పటివరకు సుమారు రూ.2కోట్లు వెనకేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.వీరందరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube