చిన్నారి ద్వారక హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష..!  

vijayawada, murder case, dwaraka case, court judgement, krishna district, accuse pentaiah - Telugu Accuse Pentaiah, Court Judgement, Dwaraka Case, Krishna District, Murder Case, Vijayawada

కృష్ణా జిల్లా గొల్లపూడిలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో విజయవాడ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో నిందితుడు అయిన పెంటయ్యకు ఉరి శిక్షను విధించింది.

 Vijayawada Murder Case Dwaraka Case Court Judgement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.2019 నవంబర్ 10న గొల్లపూడి నల్లకుంటకు చెందిన పెంటయ్య అనే వ్యక్తి కూతురు వరుసయ్యే ద్వారకా అనే చిన్నారిని అపహరించి అత్యాచారానికి పాల్పడి చంపేశాడు.అనంతరం చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.చిన్నారి కనిపించక పోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతుక్కుతుంటే.వారితో పాటు పెంటయ్య కూడా తిరిగాడు.గోనె సంచిలో బాలిక మృతదేహాం లభించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెంటయ్యను అనుమానంతో ప్రశ్నించగా తానే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.దీంతో పెంటయ్యపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించారు.

చిన్నారి ద్వారక హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ కేసులో 35 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.పెంటయ్యను దోషిగా నిర్ధారించింది.

పలు సెక్షన్ల కింద దోషికి ఏడేళ్లు, 20 ఏళ్లు, జీవితఖైదు, ఉరిశిక్షను విధించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.అయితే ఉరి శిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంది.

కోర్టు తీర్పుపై చిన్నారి ద్వారకా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ కూతురిని హతమార్చిన పెంటయ్యకు న్యాయస్థానం తగిన శిక్ష విధించిందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.

#Murder Case #Accuse Pentaiah #Vijayawada #Court Judgement #Dwaraka Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijayawada Murder Case Dwaraka Case Court Judgement Related Telugu News,Photos/Pics,Images..