వైసీపీని పరేషాన్ చేస్తున్న ఆ ఎంపీ స్థానం.. ఈ సారైనా గెలుస్తారా?

Vijayawada Mp Seat Troubling The Ycp Party

ఏపీలో గత ఎన్నికల్లో 175 స్థానాలకు 151 స్థానాలు, భారీ సంఖ్యలో ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ పార్టీ చరిత్రను తిరగరాసింది.అలాగే ఈ సారి కూడా వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 Vijayawada Mp Seat Troubling The Ycp Party-TeluguStop.com

పోయినసారిలా 151 సీట్లు రాకున్నా కానీ అధికారం నిలబెట్టుకోవడం ఖాయం అని చెబుతున్నారు.కానీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో? చెప్పడం కష్టం.కాబట్టి వైసీపీ గెలుపు మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేం.కానీ రాష్ట్రంలో ఒక్క స్థానం మాత్రం వైసీపీని తెగ ఇబ్బంది పెడుతోందట.అదే విజయవాడ పార్లమెంట్ స్థానం.

విజయవాడ పార్లమెంట్ స్థానంలో అనేక పర్యాయాలు కమ్మ నేతలే నెగ్గుకుంటూ వచ్చారు.

 Vijayawada Mp Seat Troubling The Ycp Party-వైసీపీని పరేషాన్ చేస్తున్న ఆ ఎంపీ స్థానం.. ఈ సారైనా గెలుస్తారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే ఎంపీగా ఉన్నారు.ఇక్కడ వైసీపీ ఎలాగైనా సరే జెండా పాతేందుకు చాలా ప్రయత్నిస్తోంది.

పోయిన సారి ఎన్నికల్లో వ్యాపారవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్ ను వైసీపీ ఎన్నికల బరిలో దించింది.ఆయన గట్టిగానే పోరాడినా కానీ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో పరాజయం పాలయ్యారు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ తన జెండాను ఎగరేసినా కానీ ఎంపీ స్థానం మాత్రం గెలుచుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పొట్లూరి పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.ఎన్నికల తర్వాత ఆయన వ్యాపారాలను ఆయన చూసుకుంటూ బిజీగా ఉన్నారు.కాబట్టి ఈ సారి కూడా పీవీపీకి వైసీపీ టికెట్ ఇస్తుందని భావించడం భ్రమే అవుతుంది.

పీవీపీకి బదులు వేరే వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం కూడా చూస్తోందని అంటున్నారు.మరి ఈ సారైనా వైసీపీ అక్కడ పాగా వేస్తుందో లేదో వేచి చూడాలి.

Video : The Position Of The MP Who Is Harassing The YCP Will He Win This Time?, YCP, Ap Politics

#AP #VijayawadaYcp #AP CM Jagan #PotluriVara #Vijayawada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube