బెజ‌వాడ వైసీపీలో చ‌ల్లార‌ని మంట‌లు... అవినాష్ అంద‌రివాడ‌య్యాడే...!

ఏపీలో రాజ‌కీయానికి కీల‌క న‌గ‌రం అయిన విజ‌య‌వాడలో అధికార వైఎస్సార్‌సీపీలో ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ సంగ్రామంతో కేడ‌ర్ న‌లిగిపోతోంది.క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కుకోపం.

 Leaders Fighting In Bejawada Ycp ... Avinash Is All Over The Place, Ap Politics,-TeluguStop.com

విడ‌వ‌మంటే పామ‌కు కోపం చందంగా ఈ ఇద్ద‌రు నేత‌ల న‌డుయు ప్ర‌చ్ఛ‌న్న యుద్దం న‌డుస్తోంది.చిన్న చిన్న విష‌యాల‌కు కూడా ఈ ఇద్ద‌రు నేత‌లు పంతానికి పోవ‌డంతో వైసీపీలో విబేధాలు భ‌గ్గు భ‌గ్గుమంటున్నాయి.

విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మల్లాది విష్ణుకు మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది.

ముందు జ‌గ‌న్ వెల్లంప‌ల్లికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

జ‌గ‌న్ కేబినెట్లో ఆయ‌న దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నారు.ఆ త‌ర్వాత మ‌ల్లాదికి బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు.

ఇక వెల్లంప‌ల్లికి, మ‌ల్లాదికి ఎక్క‌డ చెడిందో కాని మ‌ల్లాది లేదా ఆయ‌న కార్యాల‌యం నుంచి వెల్లంప‌ల్లి కార్యాల‌యానికి వెళ్లే సిఫార్సులు, బ‌దిలీల లెట‌ర్లు ముందుకు క‌ద‌ల‌డం లేదు.మంత్రి కూడా మ‌ల్లాది చెప్పే ఏ ప‌ని కూడా చేయ‌డానికి వీళ్లేద‌ని త‌న ఆఫీస్‌లో ఆర్డ‌ర్ పాస్ చేశార‌ని ఆఫ్ ద రికార్డు స‌మాచారం.

Telugu Malladi Vishnu, Vijayawada, Ys Jagan-Telugu Political News

ఇక బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ప‌నుల కోసం మంత్రి కార్యాల‌యం నుంచి వ‌చ్చే సిఫార్సుల‌ను సైతం మ‌ల్లాది పట్టించుకోవ‌డం లేదు.ఇటీవ‌ల విజ‌య‌వాడలో సీఎం జ‌గ‌న్ 104, 108 వాహ‌నాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్య‌క్ర‌మంలో ముందుగా మ‌ల్లాది స్టేజ్‌పైకి ఎక్క‌గా… వెల్లంప‌ల్లి స్టేజ్‌కిందే ఉండిపోయారు.ఈ విష‌యం గ‌మ‌నించిన జ‌గ‌న్ వెల్లంప‌ల్లిని స్టేజ్‌మీద‌కు ఆహ్వానించారు.ఇక న‌గ‌రంపై ఆధిప‌త్యం కోసం ఈ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో వైసీపీలో ముసలం కొద్ది రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉంది.

అయితే తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఇక్క‌డ అవినాష్ బాధ్య‌తలు స్వీక‌రించాక మొద‌ట్లో మాజీ ఇన్‌చార్జ్ బొప్ప‌న భ‌వ‌కుమార్‌తో చిన్న చిన్న మనస్ప‌ర్థ‌లు ఉన్నా.ఇప్పుడు అవినాష్ అంద‌రిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఏదేమైనా న‌గ‌ర రాజ‌కీయాల్లో సీనియ‌ర్లుగా ఉండ‌డంతో పాటు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న విష్ణు, శ్రీనివాస్ ఇద్ద‌రు స‌మ‌న్వ‌యంతో వెళ్ల‌క‌పోతే పార్టీకి ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వ‌న్న విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube