ఎయిర్‌ పోర్ట్‌ కంటే బస్టాండ్‌ బెస్ట్‌  

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు స్వయంగా ఈ మాట అన్నాడు. తాజాగా మంత్రి గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయంలో సదుపాయాలు సరిగా లేవు. ఈ విమానాశ్రయం కంటే బెజవాడ బస్టాండ్‌ చాలా బాగుంటుందని ఈయన చెప్పుకొచ్చాడు. త్వరలోనే గన్నవరం విమానాశ్రయానికి మహర్థశ పట్టనుందని, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ తరహాలో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చాడు.

విజయవాడ, గుంటూరు, తూళ్లురులో రాజధాని ఏర్పాటు జరుగుతున్న కారణంగా గన్నవరం విమానాశ్రయం కూడా అభివృద్ది చెందనుందని, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా గన్నవరం త్వరలోనే అభివృద్ది చెందడం ఖాయం అంటూ ఈయన చెప్పుకొచ్చాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ప్రతిపాధనలు ఉన్నాయని, వాటిని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పుకొచ్చాడు. తప్పకుండా రాష్ట్ర ప్రజల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని పని చేస్తామంటూ మంత్రి చెప్పుకొచ్చాడు.