మళ్లీ మేకప్ వేస్తున్న రాములమ్మ?  

Vijayashanti To Act In Lady Oriented Movie, Vijayashanti, Sarileru Neekevvaru, Tollywood News, Prathima Films - Telugu Prathima Films, Sarileru Neekevvaru, Tollywood News, Vijayashanti

టాలీవుడ్ లేడీ స్టార్ విజయశాంతి గతంలో స్టార్ హీరోయిన్‌గా ఎలాంటి సత్తా చాటిందో అందరికీ తెలిసిందే.ఆ తరువాత క్రమంగా విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటుండటంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది.

TeluguStop.com - Vijayashanti To Act In Lady Oriented Movie

దీంతో విజయశాంతి తిరిగి సినిమాలకు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.కాగా గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఆమె ఈ సినిమాలో చేసిన పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో విజయశాంతి తిరిగి సినిమాల్లో వరుస చిత్రాల్లో నటిస్తుందని అందరూ అనుకున్నారు.

TeluguStop.com - మళ్లీ మేకప్ వేస్తున్న రాములమ్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా విజయశాంతి మాత్రం కేవలం సరిలేరు నీకెవ్వరు చిత్రం తరువాత మరెలాంటి చిత్రంలో నటించలేదు.

దీంతో ఆమె నెక్ట్స్ చిత్రం ఎప్పుడు ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.అయితే తాను సినిమాల్లో తిరిగి నటించనంటూ విజయశాంతి తెగేసి చెప్పడంతో ఇకపై ఆమెను సినిమాల్లో చూడలేమని ఆమె అభిమానులు అభిప్రాయపడ్డారు.

కానీ ఇప్పుడు ఆమె మళ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.విజయశాంతి తిరిగి మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆమె నటించిన భారతరత్న చిత్ర నిర్మాణ సంస్థ ప్రతిమ ఫిలింస్ విజయశాంతి కోసం మరో అద్భుతమైన కథను రెడీ చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.లేడీ ఓరియెంటెడ్ కథను విజయశాంతి కోసం వారు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా విజయశాంతి ఈ కథకు ఇంప్రెస్ అయ్యి సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పూర్తి స్క్రిప్టును రెడీ చేశాక విజయశాంతిని ఒప్పించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, మరోసారి విజయశాంతి సినిమాలో నటించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇదే గనక నిజం అయితే రాములమ్మ అభిమానులకు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.మొత్తంగా క్యారెక్టర్ పాత్రలో కాకుండా లీడ్ రోల్‌లో విజయశాంతి కనిపిస్తుండటంతో ఆమె అభిమానులు మరోసారి విజయశాంతి నుండి అద్భుతమైన చిత్రాన్ని ఆశిస్తున్నారు.

#Prathima Films #Vijayashanti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు