విజయశాంతి తదుపరి చిత్రం కన్ఫర్మ్‌ అయినట్లేనా?

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.రీ ఎంట్రీతో ఈమె ఆకట్టుకుంది.

 Vijayashanti Sarileru Nikevvaru Mahesh Babu-TeluguStop.com

ముఖ్యంగా ఈమె యాంగ్రీగా నటించిన సీన్స్‌ పాత విజయశాంతిని గుర్తు చేసుకునేలా చేశాయి.తప్పకుండా విజయశాంతి కెరీర్‌ మళ్లీ పీక్స్‌కు వెళ్లడం ఖాయం అనుకున్నారు.

అయితే విజయశాంతి సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత నటించబోతున్న సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

ఒకప్పుడు హీరోయిన్‌గా చిరంజీవితో ఇరువైకి పైగా సినిమాలు చేసిన విజయశాంతి ఇప్పుడు రీ ఎంట్రీలో ఆయన సినిమాలో నటించబోతుంది.మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.ఆ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విజయశాంతిని తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుందట.

Telugu Mahesh Babu, Tollywood Box, Vijayashanti-Latest News - Telugu

గతంలో చిరంజీవి మరియు విజయశాంతిల మద్య వివాదం ఉన్న విషయం తెల్సిందే.అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా ఆ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పడిపోయి ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంను షేర్‌ చేసుకుని మళ్లీ కలిసి నటించాలని ఒప్పందం చేసుకున్నారు.ఆ కారణంగానే మెగా 152లో ఆమె ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.ఆ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఒక వేళ మెగా 152లో విజయశాంతి ఉంటే ఆ సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లడం ఖయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube