బాలయ్యతో విభేదాలపై స్పందించిన విజయశాంతి.. తన ఇమేజ్ పెరిగిందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో ఏకంగా 17 సినిమాలు తెరకెక్కాయి.

 Vijayashanti Given Clarify On Clashes With Balakrishna-TeluguStop.com

బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన తొలి సినిమా కథానాయకుడు కాగా నిప్పురవ్వ చివరి సినిమా కావడం గమనార్హం.బాలయ్య విజయశాంతి కలిసి నటించిన సినిమాలలో రౌడీ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

అయితే నిప్పురవ్వ తర్వాత బాలయ్య, విజయశాంతి కలిసి నటించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.బాలకృష్ణ, విజయశాంతి ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలు నిజమేనని నమ్మారు.

 Vijayashanti Given Clarify On Clashes With Balakrishna-బాలయ్యతో విభేదాలపై స్పందించిన విజయశాంతి.. తన ఇమేజ్ పెరిగిందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ బాలయ్యతో విభేదాల గురించి స్పష్టతనిచ్చారు. నిప్పురవ్వ సినిమా తర్వాత తన పారితోషికం భారీస్థాయిలో పెరిగిందని విజయశాంతి అన్నారు.

ఆ సినిమా తర్వాత తన ఇమేజ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని విజయశాంతి చెప్పుకొచ్చారు.నిప్పురవ్వ తర్వాత తాను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టానని ఆ కారణం వల్లే తాను బాలయ్య కలిసి నటించలేదని విజయశాంతి అన్నారు.అంతకు మించి తాను, బాలకృష్ణ కలిసి సినిమాల్లో నటించకపోవడానికి ప్రత్యేకమైన కారణం లేదని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Telugu 17 Movies, Balakrishna, Given Clarity, Interesting Facts, Nippuravva, Tollywood, Vijayashanti-Movie

నాయుడమ్మ సినిమా తర్వాత విజయశాంతి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారనే సంగతి తెలిసిందే.అయితే విజయశాంతి పాలిటిక్స్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.సరిలేరు నీకెవ్వరు సినిమాతో దాదాపు 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.

అయితే వరుసగా సినిమాల్లో నటించడానికి మాత్రం విజయశాంతి ఆసక్తి చూపడం లేదు.పరిమితంగా సినిమాలలో నటిస్తున్న విజయశాంతి భవిష్యత్తులో బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే ఓకే చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది.

 విజయశాంతి ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు.

#Balakrishna #Nippuravva #Vijayashanti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube