'నా మరణం తర్వాత నా ఆస్తులన్నీ..? అందుకే పిల్లల్ని కనలేదు'.విజయశాంతి సంచలన కామెంట్స్.!     2018-10-06   08:40:38  IST  Sainath G

సావిత్రి, వాణిశ్రీ, జమున గారి తరవాత అచ్చ తెలుగు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటులలో “విజయశాంతి” గారు ఒకరు. పాత్రకు తనవంతు న్యాయం చేసి ఎన్నో అవార్డ్స్ అందుకోవడమే కాదు, ఆడియన్స్ ని మెప్పించారు. గ్లామర్ కు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్నా పాత్రలు కూడా ఎన్నో చేసారు “విజయశాంతి” గారు. మంచి నటి గానే కాక, రాజకీయాల్లో చేరి ప్రజలకు ఎన్నో మంచి సేవలు చేసి ప్రజాధారణ పొందారు! దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతిగా వినుతికెక్కిన విజయశాంతి తెలుగు చలన చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన నటి.

విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు.విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది.

ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయిన “విజయశాంతి” గారికి పెళ్లి అయిన సంగతి కూడా మనలో చాలా మందికి తెలియదు. సినిమాల్లో చేస్తున్నప్పుడే ఎప్పటినుండో పరిచయం ఉన్న”శ్రీనివాస్ ప్రసాద్” ను పెళ్లి చేసుకుంది. ఎటువంటి హంగామా లేకుండా పెళ్లి సింపుల్ గా జరిగిందట. ఆమె రాజకీయాల్లోకి రావడం వెనక కూడా ఆయన ప్రోత్సాహం ఉందట. 2014లో ఓటమి తర్వాత సినీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

2014 ఎన్నికల తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒక మేజర్ సర్జరీ జరిగింది. దానిని నుంచి కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. అందుకే సినీ రంగానికి, రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజాసేవలకు అంకితం కావాలన్న ఉద్దేశంతో నేను పిలల్ని కనొద్దనుకొన్నాను. సంతానం ఉంటే ఆశ పెరిగిపోతుంది. స్వార్ధం ఎక్కువవుతుందని అనుకొన్నాను. అందుకే నేను నా భర్త, పిల్లల వద్దని అనుకొన్నాం.

నా మరణాంతరం నా ఆస్తి మొత్తం ప్రజలకు చెందేలా చర్యలు తీసుకొంటాను. నా తల్లి పేరున, నా పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాటికి నా ఆస్తిని మొత్తం ధారాదత్తం చేస్తాను. విద్య, వైద్యం కోసం నా ఆస్తిని కేటాయిస్తాను. ఈ విషయాన్ని మెదక్‌లో ఎప్పుడో చెప్పాను. ఓ దశలో నా నగలన్నీ తీసుకెళ్లి వెంకటేశ్వరస్వామి హుండీలో వేశాను.