మహేష్ మూవీలో విజయశాంతి రీ ఎంట్రీ! చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్  

మహేష్ సినిమాలో విజయశాంతి నటిస్తుంది. మే 31న ప్రారంభం. .

Vijayashanthi Ready To Act In Mahesh Babu Movie-mahesh Babu Movie,telugu Cinema,tollywood,vijayashanthi Ready To Act

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి. ఇక విజయశాంతి స్టార్ హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ లతో లేడీ హీరోగా టర్న్ తీసుకొని తనదైన ముద్ర వేసింది. ఇక చాలా ఏళ్ళుగా సినిమాలకి దూరంగా ఉంటూ రాజకీయాలలో బిజీగా ఉన్న విజయశాంతి చాల గ్యాప్ తర్వాత మళ్ళీ ముఖానికి రంగు వేసుకోవడానికి సిద్ధం అవుతుంది..

మహేష్ మూవీలో విజయశాంతి రీ ఎంట్రీ! చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్-Vijayashanthi Ready To Act In Mahesh Babu Movie

అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విలేజ్ నేపధ్యంలో నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని దర్శకుడు సంప్రదించగా ఆమె చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ద్రువీకరించాకున్న ఇది వాస్తవం అనే మాట వినిపిస్తుంది. ఇక 30 ఏళ్ల క్రితం మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొడుకు దిద్దిన కాపురం అనే సినిమాలో విజయశాంతితో కలిసి నటించాడు. ఆ సినిమాలో కృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్స్ గా వారి కొడుకుగా మహేష్ బాబు నటించాడు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం సూపర్ స్టార్ ఫాన్స్ లో కూడా ఆసక్తి నెలకొని ఉంది.