విజయశాంతిని మళ్ళీ టాలీవుడ్ కి పరిచయం చేస్తున్న అనిల్ రావిపూడి  

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రీఎంట్రీ ఇస్తున్న రాములమ్మ. .

Vijayashanthi Re-entry In Anil Ravipudi Direction-super Star Mahesh Babu,telugu Cinema,tollywood,vijayashanthi Re-entry

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తిమ్పూ సొంతం చేసుకున్న నటి విజయశాంతి. తెలుగులో అగ్ర హీరోలందరితో కలిసి నటించిన విజయశాంతి, చిరంజీవితో కలిసి చేసిన సినిమాలలో అతనికి పోటీగా డాన్స్ చేసి సత్తా చాటేది. దీంతో అటు కమర్షియల్ సినిమాలతో పాటు, ఇటు మంచి కథ బలం సినిమాలతో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది...

విజయశాంతిని మళ్ళీ టాలీవుడ్ కి పరిచయం చేస్తున్న అనిల్ రావిపూడి-Vijayashanthi Re-entry In Anil Ravipudi Direction

తరువాత తెలుగులో యాక్షన్ క్వీన్ గా మారిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ కథలతో వరుస సక్సెస్ లు అందుకుంది. ఆ హీరోగా చేసిన సినిమాలలో కర్తవ్యం ఇప్పటికి అందరికి భాగా నచ్చుతుంది. అలాగే ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు కూడా విజయశాంతి సత్తాని పరిచయం చేస్తాయి.

ఇదిలా ఉంటే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న విజయశాంతి త్వరలో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. హిట్ చిత్రాల దర్శకుడు త్వరలో మహేష్ తో తెరకెక్కించే సినిమా లో కీలక పాత్ర కోసం విజయశాంతిని రంగంలోకి దించుతున్నాడు. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ చూసి, అలాగే పాత్ర ప్రాధాన్యత తెలుసుకొని ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇందులో మరో కీలక పాత్ర కోసం నిర్మాతగా మారిన నటుడు బండ్ల గణేష్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.