మహాత్ముడుని స్మరించుకున్న విజయశాంతి  

Vijayashanthi Mahatma Gandhi Words Nature - Telugu Congress, Corona Virus, Lock Down, Telugu Politics, Vijayashanthi Remember Mahatma Gandhi Words On Nature

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేటి కాంగ్రెస్ మహిళా నాయకురాలు

విజయశాంతి

ఈ మధ్య కాలంలో

పొలిటికల్

గా మంచి యాక్టివ్ గా ఉంటున్నారు.

కేసీఆర్

మీద విమర్శలు చేస్తూ మీడియాలో ఎప్పుడు కనిపించే విజయశాంతి తాజాగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితులపై చలించిపోయింది.గత కొద్దిరోజులుగా తనవంతుగా మీడియా ముందుకి వచ్చి ప్రజలకి చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మయే మహాత్మ గాంధీని స్మరించుకుంది.నాడు మహాత్ముని మాటలు నేటి కళ్లకు కడుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.

 Vijayashanthi Mahatma Gandhi Words Nature

ప్రపంచం మొత్తం విస్తరించిన

కరోనా వైరస్

తో మొత్తం అందరూ షట్ డౌన్ స్టేజిలోకి వెళ్ళిపోయారు.

దీనిని చూస్తుంటే నాడు మహాత్ముడు ప్రకృతి ప్రతి ప్రాణి ఆకలిని మాత్రమే తీర్చుతుంది, అత్యాశను కాదు అన్న మాటలు గుర్తొస్తున్నాయని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది.ప్రకృతి ప్రతి ప్రాణి ఆకలినీ తీర్చగలదు, అత్యాశను కాదు ఓ మహాత్మా ఓ మహర్షీ

భారతదేశపు జాతిపితా

మీరు ఆనాడు చెప్పిన భాష్యం సత్యమై వాస్తవమై ఈ రోజు అనేక దేశాలు, ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలు అతలాకుతలమవుతూ అత్యాశల వ్యాపార వ్యవస్థలను మూసివేసి ఆకలి తీర్చే ప్రకృతిమాత ప్రసాదాలైన నిత్యావసరాలను ప్రజలకు అందించటానికి సతమతమవుతున్నాయి.

మహాత్ముడుని స్మరించుకున్న విజయశాంతి-General-Telugu-Telugu Tollywood Photo Image

మీ ప్రవచన విలువలు భారతావనికే కాదు యావత్ ప్రపంచానికి నిత్య సుభాషితాలు అని విజయశాంతి పోస్టు చేసింది.విజయశాంతి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijayashanthi Remember Mahatma Gandhi Words On Nature Related Telugu News,Photos/Pics,Images..