'విజయశాంతి' భర్త ఎవరో మీకు తెలుసా..? ఎవర్ని పెళ్లి చేసుకుందో మీరే చూడండి..!  

Vijaya Shanthi Husband Personal Details-

సావిత్రి, వాణిశ్రీ, జమున గారి తరవాత అచ్చ తెలుగు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటులలో “విజయశాంతి” గారు ఒకరు.పాత్రకు తనవంతు న్యాయం చేసి ఎన్నో అవార్డ్స్ అందుకోవడమే కాదు, ఆడియన్స్ ని మెప్పించారు.గ్లామర్ కు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్నా పాత్రలు కూడా ఎన్నో చేసారు “విజయశాంతి” గారు...

Vijaya Shanthi Husband Personal Details--Vijaya Shanthi Husband Personal Details-

మంచి నటి గానే కాక, రాజకీయాల్లో చేరి ప్రజలకు ఎన్నో మంచి సేవలు చేసి ప్రజాధారణ పొందారు!

Vijaya Shanthi Husband Personal Details--Vijaya Shanthi Husband Personal Details-

దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతిగా వినుతికెక్కిన విజయశాంతి తెలుగు చలన చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన నటి.ఈమె జూన్ 24, 1964న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది.విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే.విజయశాంతి అసలు పేరు శాంతి.ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది.

విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు.ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా.ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా.తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు.ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ; చిత్ర దర్శకురాలు విజయనిర్మల..

విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది.వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన ‘సత్యం – శివం’లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది.ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది.

విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం.అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది.క్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది...

అయితే చాలా మంది నటీనటుల ఫామిలీ ఫోటోల గురించి మనకి తెలుస్తూనే ఉంటుంది.ఎవరిని పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఎవరు అని.కానీ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయిన “విజయశాంతి” గారికి పెళ్లి అయిన సంగతి కూడా మనలో చాలా మందికి తెలియదు.సినిమాల్లో చేస్తున్నప్పుడే ఎప్పటినుండో పరిచయం ఉన్న”శ్రీనివాస్ ప్రసాద్” ను పెళ్లి చేసుకుంది...

ఎటువంటి హంగామా లేకుండా పెళ్లి సింపుల్ గా జరిగిందట.ఆమె రాజకీయాల్లోకి రావడం వెనక కూడా ఆయన ప్రోత్సాహం ఉందట!