సంక్రాంతి వరకు ఈ సెలవులు కొనసాగిస్తాడేమో  

Vijayashanthi Comments On Dussara Holidays And Cm Kcr-school Childrens Future,vijayashanthi,vijayashanthi Comments In Rtc And Kcr

తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్‌కు దసరా హాలీడేస్‌ను పొడగించిన విషయం తెల్సిందే.ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ముందస్తుగానే దసరా సెలవులను వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లుగా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది.అసలు ఆర్టీసీ సమ్మెకు స్కూల్‌ పిల్లలకు సంబంధం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.పిల్లల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

Vijayashanthi Comments On Dussara Holidays And Cm Kcr-school Childrens Future,vijayashanthi,vijayashanthi Comments In Rtc And Kcr-Vijayashanthi Comments On Dussara Holidays And CM KCR-School Childrens Future Vijayashanthi In Rtc Kcr

ఈ విషయమై కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి కూడా తీవ్రంగా స్పందించారు.ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దసరా సెలవులను పొడగించడం ఏంటంటూ ప్రశ్నించింది.సమ్మె కొనసాగినంత కాలం పిల్లలకు సెలవులు ఇస్తే దసరా సెలవులు కాస్త సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం ఉందని ఆమె ఎద్దేవ చేసింది.

Vijayashanthi Comments On Dussara Holidays And Cm Kcr-school Childrens Future,vijayashanthi,vijayashanthi Comments In Rtc And Kcr-Vijayashanthi Comments On Dussara Holidays And CM KCR-School Childrens Future Vijayashanthi In Rtc Kcr

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన రాములమ్మ వెంటనే వారి న్యాయబద్దమైన హక్కులను పరిష్కరించి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వంను డిమాండ్‌ చేసింది.ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ విషయమై స్పందించడం లేదు.ప్రత్యామ్నాయ మార్గాలను పెంచుతూ సమ్మెలో పాల్గొంటున్న వారు ఆర్టీసీ కార్మికులు కారని తేల్చి చెప్పింది.