బీజేపీలోకి లేడీ అమితాబ్?

సౌత్ ఇండియాతో లేడీ అమితాబ్‌గా పేరు సంపాదించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ కాలేకపోయింది.సినిమాల్లో సక్సెస్ అయిన ఆమె.

 Vijayshanthi Join In Bjp Party  Vijayshanthi, Kishan Reddy, Congress, Bjp, Dubba-TeluguStop.com

రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.టీఆర్‌ఎస్‌తో రాజకీయ అరగ్రేటం చేసిన ఆమె.అప్పట్లో కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా ఉంది.ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఆమె.కొత్త పార్టీ పెట్టింది.

కొత్త పార్టీ కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

కొత్త పార్టీని మూసివేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి కొద్ది సంవత్సరాలుగా ఆ పార్టీలోనే ఉంటుంది.అయితే విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరనుందని సమాచారం.

త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని ఆమె బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.

గత కొద్దికాలంగా కాంగ్రెస్‌తో విజయశాంతి అంటీముంటనట్లుగా ఉన్నారు.

ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు.దుబ్బాక ఉపఎన్నికలు జరుగుతున్నా.

కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి ప్రచారం కూడా చేయడం లేదు.దీంతో కాంగ్రెస్‌లో ఆమె అసంతృప్తిగా ఉన్నారనే వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా విజయశాంతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.కొద్దిరోజుల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతిని కలిశారు.

బీజేపీలో చేరాల్సిందింగా వారిద్దరు విజయశాంతిని ఆహ్వానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube