చిరంజీవి మాటలు నాకు స్పూర్తినిచ్చాయి... విజయశాంతి వ్యాఖ్యలు

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా ఒకానొకప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంది.అలాగే ఆమెని స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.

 Vijayasanthi Comments On Megastar Chiranjeevi-TeluguStop.com

విజయశాంతి సినిమా అంటే నిర్మాతలకి మంచి ఓపెనింగ్స్ ఉండేవి.అంతలా టాలీవుడ్ లో మకుటం లేని మహారాణిలా విజయశాంతి ఏలింది అని చెప్పాలి.

ఆమె స్థాయిలో హీరోయిజాన్ని అంతకు ముందుగాని, ఆ తరువాత గాని తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చూపించలేకపోయారు.అందుకే టాలీవుడ్ లో విజయశాంతికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

అయితే ఆమె వైజయంతి అనే సినిమా తర్వాత సినిమాలకి విరామం ఇచ్చి మరల పదేళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి విజయశాంతికి ఒక రేంజ్ లో పోగిడేసాడు.

ఇక వీళ్ళ కెమిస్ట్రీ ఈ ఫంక్షన్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉంటె చిరంజీవి ప్రసంశల మీద విజయశాంతి స్పందించింది.

మెగాస్టార్ చిరంజీవి మాటలు తనకి ఎంతగా స్ఫూర్తి నిచ్చాయో చెప్పింది.నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే, కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి.

ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం.జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో, నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను “గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక” అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను.

అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా.లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా, ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను.

అని పేస్ బుక్ లో కామెంట్స్ చేసింది.ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా చిరంజీవి-కొరటాల సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో చేస్తుంది అనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube