చిరంజీవి లూసిఫర్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.అద్భుతమైన పాత్రతో మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజయ శాంతికి ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

 Vijayasanthi Chiranjeevi Lucifar-TeluguStop.com

అయితే ఆమె మాత్రం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంది.సినిమాలు కూడా సెలక్టివ్ గా ఎంచుకుంటుంది.

సరిలేరు తర్వాత ఇప్పటి వరకు మరొక సినిమా ఆమె ఒప్పుకోలేదు.అయితే ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

 Vijayasanthi Chiranjeevi Lucifar-చిరంజీవి లూసిఫర్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడం విశేషం.

సుజిత్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమా ఆచార్య తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఈ సినిమాలో మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించడం జరిగిందని, పాత్ర ఇంటెన్సన్ ప్రకారం విజయశాంతి అయిన ఆ రోల్ కి పెర్ఫెక్ట్ ఛాయస్ అని భావించి చిరంజీవి రిఫరెన్స్ తో ఆమెని సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది.ఇక విజయశాంతి కూడా ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు