కేంద్ర ఆర్థిక మంత్రి తో విజయసాయిరెడ్డి భేటీ..!!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా భేటీకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

 Vijayasaireddy Meets Union Finance Minister-TeluguStop.com

గతంలో వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చెల్లించిన 219 కోట్ల రూపాయల నిధులను తిరిగి వడ్డీతో చెల్లించాలి అని ఐటీ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ సానుకూల ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రకారంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ని కోరినట్లు విజయ సాయి రెడ్డి వెల్లడించారు.

నిర్మలా సీతారామన్ ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని .తిరిగి నిధులు చెల్లింపుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.అదేరీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టే కార్యకలాపాల విషయంలో జిఎస్టి మినహాయింపు కల్పించాలని కోరినట్లు కూడా తెలిపారు.

 Vijayasaireddy Meets Union Finance Minister-కేంద్ర ఆర్థిక మంత్రి తో విజయసాయిరెడ్డి భేటీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ప్రవాస భారతీయులు అందించే విరాళాలు విషయం ఎఫ్ సీఆర్ఏ దరఖాస్తు పై ప్రముఖంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

#Vijay Sai Reddy #219 Crores Debt #UnionFinance #It Cell

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు