చంద్రబాబు పై వైరల్ కామెంట్లు చేసిన విజయసాయిరెడ్డి..!!

వైసీపీ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు.కరోనా కేసులు లెక్కలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖండించారు.

 Vijayasaireddy Made Viral Comments On Chandrababu-TeluguStop.com

రాష్ట్రంలో ఎక్కడ మరణం సంభవిస్తుందో అన్న విధంగా చంద్రబాబు కని పెట్టుకొని మరి కూర్చున్నారని, కనీసం రాత్రిపూట అతనికి నిద్ర పట్టడం లేదని అన్నట్టుగా చంద్రబాబుపై ఆ శాపం ఉంది ఏమో అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఈ రీతిలో కామెంట్ పెట్టారు… “కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది.

 Vijayasaireddy Made Viral Comments On Chandrababu-చంద్రబాబు పై వైరల్ కామెంట్లు చేసిన విజయసాయిరెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది.ఆపత్కాలాల్లో ప్రజలను కాపడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం.

ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచనను ఆశించలేం.కొన్ని బతుకులంతే.

ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు.రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుంది.

ఉన్న పనల్లా ఇదే.నాలుగు రోజులు పాటు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఏ అర్థరాత్రో తనే ఆక్సిజన్ పైపులను కోసినా కోసొచ్చే నికృష్టుడు.” అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.

#Vijayasaireddy #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు