సాయిరెడ్డి గ‌ట్స్ వేరే.. జ‌గ‌న్ మెచ్చింది ఇదేనేమో...!

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.విజ‌య‌సాయిరెడ్డి.

 Vijayasaireddy Guts Different In Politics,ysrcp,leader,mp,vijaya Sai Reddy,twitt-TeluguStop.com

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో పార్టీల‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఉంటారు.నాయ‌కులు కూడా ఉంటారు.

కానీ, అతి స్వ‌ల్ప కాలంలో అత్యున్న‌త స్థాయికి చేరుకునే నాయ‌కులు చాలా అరుదుగా ఉంటారు.ఇలాంటి వారిలో సాయిరెడ్డి ప్ర‌ముఖంగా మ‌న‌కు వైసీపీలో క‌నిపిస్తున్నారు అంటున్నారు విశ్లేష‌కులు.

సీఎం జ‌గ‌న్‌కు అంత్యంత స‌న్నిహితుడు.రాజ‌కీయాల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందిన నేత‌.

విజ‌య‌సాయిరెడ్డి.ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు.

ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.బీజేపీ చీఫ్‌.అమిత్‌షా వంటివారితోనూ సాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.పార్టీకి ఎక్క‌డ ఎలాంటి మెరుపులు.

ఎలాంటి విరుపులు రావాలో వాటిని అక్క‌డ‌క్క‌డ మెరిపిస్తున్నారు.అయితే, ఇంత‌గా జ‌గ‌న్ ఆయ‌న‌కు మంచి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంలో వ్యూహం ఏంటి? ఎంతో మంది నాయ‌కులు ఉన్నా.సాయిరెడ్డికి ఉన్న స్పెష‌ల్ ఏంటి? అనే ఆలోచ‌న చేస్తే.సాయిరెడ్డిలో ఉన్న గ‌ట్సే!! అంటున్నారు విశ్లేష‌కులు.
ఆయ‌న ఎక్క‌డా జంకరు.పార్టీ వ్యూహాన్ని.అధినేత నిర్ణ‌యాన్ని నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించ‌డంలో సాయిరెడ్డి.త‌న‌కు ఏదైనా ఆప‌ద వ‌స్తుందేమో.

అనే ఆలోచ‌న కూడా చేయ‌రు.ఇదే జ‌గ‌న్‌కు న‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏకంగా పార్ల‌మెంటులోనూ సాయిరెడ్డి సాహ‌సోపేత‌మైన ప్ర‌సంగం చేశారు.నిజానికి మూడు రాజ‌ధానుల విష‌యం ఎటూ క‌ద‌ల‌లేదు.

పైగా అమ‌రావ‌తిని త‌ర‌లించే అంశం ఇంకా కోర్టులోనే ఉంది.అయినా కూడా సాయిరెడ్డి.

రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ.విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా పేర్కొన్నారు.“రాబోయే రోజుల్లో విశాఖ పాల‌నారాజ‌ధాని కాబొతోంది.కాబ‌ట్టి ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి.

కేంద్ర ప‌రిపాల‌నా ట్రైబ్యున‌ల్‌ను ఏర్పాటు చేయాలి“ అని ఆయ‌న ప్ర‌సంగించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది.

నిజానికి ఇంకా ఏర్పాటు కాని.

అంశాల‌పై ఎవ‌రు మాట్లాడినా.స‌భ‌లో అడ్డుకుంటారు.

కానీ, సాయిరెడ్డికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు.పైగా ఆయ‌న దూకుడుగా రాజ‌ధాని గురించి చెప్పారు.

అంతేకాదు, రాజ‌ధాని మార్పును ఎవ‌రూ.ఎక్క‌డా .ఆప‌లేరు అని కూడా సాయిరెడ్డి చెప్ప‌డం.ఆయ‌న‌లో ఉన్న గ‌ట్స్‌కు సంకేతంగా చెబుతున్నారు.

బ‌హుశ‌.ఇదే జ‌గ‌న్‌కు న‌చ్చి ఉంటుంద‌ని అంటున్నారు.

మొత్తానికి ఈ విష‌యం వైసీపీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube