గంటా శ్రీనివాస‌రావు పై విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యలు.. వైసీపీలోకి ఆహ్వానం.. ?

ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ట్విస్ట్‌లు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య వర్గపోరుల మారిన ఇక్కడి రాజకీయాల్లో ఊహించని విధంగా పరిణామాలు సంభవిస్తున్నాయి.

 Vijayasaireddy Comments On Ganta Srinivasa-TeluguStop.com

తన పట్టు నిలుపుకోవాలని వైసీపీ శ్రేణుల ఆరాటం, ఎలాగైనా వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గించాలని టీడీపీ వీరి ఆట టాం అండ్ జెర్రీ కార్డున్ షోలా సాగుతుందంటున్నారట.

ఇకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, టీడీపీ నేతలు దాదాపుగా వలస వెళ్లారు.

 Vijayasaireddy Comments On Ganta Srinivasa-గంటా శ్రీనివాస‌రావు పై విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యలు.. వైసీపీలోకి ఆహ్వానం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అరకొర నాయకులు మాత్రమే సైకిల్ పట్టుకుని వేలాడుతున్నారు.ఈ నేపధ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అనుచ‌రుడు, టీడీపీ నేత కాశీ విశ్వ‌నాథ్ కూడా ఈ రోజు విశాఖ‌లో ఎంపీ విజ‌య‌సాయి రెడ్డితో పాటు, ప‌లువురి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.

Telugu Andrapradesh, Ganta, Join, Vijaya Sai, Ycp-Latest News - Telugu

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ, సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న చూసే చాలా మంది వైసీపీలో చేరుతున్నారని, గంటా శ్రీనివాస‌రావు కూడా త‌మ‌కు కొన్ని ప్రతిపాద‌న‌లు పంపారని పేర్కొన్నారు.వైఎస్ జ‌గ‌న్ ఆమోదం త‌ర్వాత గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.ఇకపోతే గత కొన్ని నెలలుగా ఈ ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.మరి నిజానికి గంట, పంకను పట్టుకుంటాడ లేడా అనేది మాత్రం ఖచ్చితంగా తెలవడం లేదు.

ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.

#Ganta #Andrapradesh #Vijaya Sai #Join

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు