పథకాలు వద్దని చెప్పిన టీడీపీ కార్యకర్తకు ₹90వేల లబ్ది విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గడపగడప పర్యటన కార్యక్రమంలో టీడీపీ పార్టీకి చెందిన శివన్న అనే వ్యక్తి తమకి వైసీపీ ప్రభుత్వ పథకాల అవసరం లేదని చెప్పడం తెలిసిందే.ఎమ్మెల్యే సామరస్యంగా వెళ్లి మాట్లాడుతున్న గాని సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి సదరు ఏరియా వాలంటీర్ ని పిలిపించి.

 Vijayasai Reddy Sensational Comments On Tdp Worker Who Said He Didn Want Schemes-TeluguStop.com

వీళ్ళకి పథకాలు వద్దంటున్నారు.ఎందుకు బలవంతంగా ఇస్తున్నారు.

తప్పు కదా.తీసేయండి అంటూ తెలియజేశారు.

 Vijayasai Reddy Sensational Comments On TDP Worker Who Said He Didn Want Schemes-TeluguStop.com

పథకాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు వాళ్ళకి న్యాయం చేసినట్లు అవుతుంది అని అన్నారు.అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.స్పందించారు.

ఎమ్మెల్యే గడప గడపకు వస్తుండటంతో ఇంటిపై తెలుగుదేశం జెండా కట్టి – పరుషంగా మాట్లాడిన కొందన్నగారి శివన్నకి మూడేళ్లలో 90 వేలకు పైగా లబ్ది.కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గం చూడకుండా ప్రజలందరికీ లబ్ది.అందరి సంక్షేమమే జగన్ గారి ప్రభుత్వ లక్ష్యం అంటే ఇదే.అని ఆధారాలతో సహా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Video : Vijayasai Reddy's Sensational Comments On TDP Worker Who Said He Didn't Want Schemes Vijayasai Reddy, TDP #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube