రాజ్యసభలో విజయసాయి రెడ్డి వర్సెస్ వెంకయ్య నాయుడు..!!

రాజ్యసభలో టిడిపి పార్టీకి చెందిన నాయకుడు ఎంపీ కనకమేడల సీఎం జగన్ పై భారి స్థాయిలో తీవ్ర విమర్శలు కురిపించడం జరిగింది.దీంతో వెంటనే విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు.

 Vijayasai-reddy-vs-venkaiah-naidu-in-the-rajya-sabha Vijay Sai Reddy,venkaiaha N-TeluguStop.com

అయితే వెంకయ్య నాయుడు విజయ సాయి రెడ్డి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను తోసిపుచ్చారు.

ఈ పరిణామంతో వెంటనే నిరసనగా సభలో వైసీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు.

ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి వెంకయ్య నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మీ మనసు బిజెపి పార్టీతో తనువు టిడిపితో ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.తనకి ఉపరాష్ట్రపతి వచ్చినవెంటనే పార్టీకి రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు.

అప్పటి నుండి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, తన హృదయమంతా దేశ ప్రజలతో మమేకమైయిందని, ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకోను అంటూ విజయసాయిరెడ్డికి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో చురకలు అంటించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube