టీడీపీ కి 30 సీట్లు కూడా రావు  

Vijayasai Reddy Comments On Tdp And Chandra Babu Naidu-vijayasai Reddy,ys Jagan,ysrcp,చంద్ర బాబు నాయుడు,టి‌డి‌పి

తెలుగు దేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నెం.2 అయిన విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో చేస్తున్న పనులు, చెబుతున్న మాటలు పిట్టల దొర మాటల మాదిరిగా ఉన్నాయని, ఆయన మాటలు తుపాకి రాముడు మాటలను మించి పోయాయంటూ విజయసాయి అన్నాడు.మరోసారి అధికారం దక్కించుకుంటాం అంటూ భీరాలు పోతున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు గట్టి బుద్ది చెప్పబోతున్నారు..

టీడీపీ కి 30 సీట్లు కూడా రావు-Vijayasai Reddy Comments On Tdp And Chandra Babu Naidu

ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టీ కనీసం 30 సీట్లు కూడా పొందలేడంటూ జోస్యం చెప్పాడు. తన మీడియాలో ప్రధాని రేసులో బాబు ఉన్నాడు అంటూ చెప్పించుకోవడం పెద్ద జోక్‌గా అనిపిస్తుందని అన్నాడు. ఇదే సమయంలో నాకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని చెప్పడం కూడా ఆయన అతికి నిదర్శనం.చంద్రబాబు ప్రధాన మంత్రి అవ్వడం అలా ఉంచి అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లబోతున్నాడు అంటూ విజయసాయి అన్నాడు.

ఊహకు అందని కోతలతో కోతల రాయుడు, తుపాకి రాముడు చెప్పేటువంటి మాటలకు అంతా నవ్వుకుంటున్నారు అంటూ ఈ సందర్బంగాయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలు చంద్రబాబు నాయుడుకు ఏ అర్హత ఉందని పీఎం పదవి రేసులో ఉన్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీకి ఇక కాలం చెల్లిందని, మరోసారి వారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అంటూ గట్టిగా చెబుతున్నారు.