వికేంద్రీకరణతో అమరావతి రైతులకు అన్యాయం జరగదు -విజయసాయిరెడ్డి

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగిచాలంటూ భూములు ఇచ్చిన రైతులు నిరసనలు చేపట్టారు.రాజధాని వికేంద్రీకరణతో అమరావతికి అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.

 Vijayasai Reddy, Ap Politics, Three Capitals, Amaravathi Development, Ycp Leader-TeluguStop.com

కాగా, వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు రాజధాని అంశంపై సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రాజధాని వికేంద్రీకరణతో అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమి లేదని విజయసాయిరెడ్డి అన్నారు.మూడు రాజధానులతో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

సీఎం జగన్ ఏఎమ్‎ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్ధమవుతుందని చెప్పుకొచ్చారు.రాజధాని వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని విజయసాయిరెడ్డి అన్నారు.

అమరావతి రైతులకు ఎట్టి పరిస్ధితుల్లో అన్యాయం జరగదని.కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీ ఇవ్వలేరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube