కేసీఆర్‌తో రాజీకి ప్రాదేయపడేందుకు వెళ్లావా బాబు?  

Vijayasai Fires On Cbn కేసీఆర్‌-kcr,ramoji Rao,tdp,vijaya Sai Reddy,ys Jagan,ysrcp,కే‌సి‌ఆర్,చంద్ర బాబు నాయుడు,రామోజీ రావ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలిసిన విషయం తెల్సిందే. సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో చంద్రబాబు నాయుడు ల్యాండ్‌ అయ్యాడు. రామోజీ రావుతో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు రామోజీ రావును కలిశాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది...

కేసీఆర్‌తో రాజీకి ప్రాదేయపడేందుకు వెళ్లావా బాబు?-Vijayasai Fires On Cbn కేసీఆర్‌

వైకాపా సీనియర్‌ నాయకుడు విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం జరిగింది. ప్రజా ధనం వృదా చేసి ఎందుకు రామోజీ రావును చంద్రబాబు నాయుడు కలిసేందుకు వెళ్లాడు. అసలు రామోజీ రావుతో చంద్రబాబు నాయుడుకు పనేంటి అంటూ ప్రశ్నించాడు.

కేసీఆర్‌ తో రామోజీ రావుకు ఉన్న సంబంధం నేపథ్యంలో చంద్రబాబు తనకు కూడా రాజీ కుదుర్చుతాడని వెళ్లి ఉంటాడా, కేసీఆర్‌తో రాజీకి రామోజీ వద్ద చంద్రబాబు ప్రాదేయ పడ్డాడా అంటూ విజయసాయి ఆరోపించాడు.విజయసాయి పూర్తి ట్వీట్‌ ఇది :

ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను  కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?