మొన్నటి వరకు తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల నీటి వివాదం తారా స్థాయిలో నడిచింది.అనూహ్యంగా కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మంత్రులు వైఎస్సార్ మీద, జగన్ మీద దుమ్మెత్తి పోశారు.
మంత్రి ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు ఏపీ అక్రమ కట్టడాలపై తీవ్ర పదజాలంతో తిట్ల పురాణం ఎత్తుకున్నారు.ఏకంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దొంగ అని, జగన్ గజదొంగ అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
అయితే దీనిపై అటు జగన్ గానీ, షర్మిల గానీ, విజయమ్మ గానీ మాట్లాడలేదు.
ఇలా వారు మౌనంగా ఉండటంతో ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానాలను రేవంత్ రెడ్డి లేవనెత్తారు.
ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారిని ప్రశ్నించారు.ఇక షర్మిలకు అయితే దీనిపై మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.
కృష్ణా జలాల వివాదంపై తాను మాట్లాడితే తన పార్టీకి నష్టం అని షర్మిల మౌనంగా ఉన్నారు.కానీ దీనిపై ఇప్పుడు వైఎస్ విజయమ్మ తీవ్రంగా స్పందించారు.
ఈరోజు షర్మిల కొత్త పార్టీ అయిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవర్భావ సభను నిర్వహించారు.కాగా దీంట్లో పాల్గొన్న వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ తెలంగాణ మంత్రులకు కౌంటర్లు వేశారు.

వైఎస్ రాజశేఖర్ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదని వారు ఎన్నడూ ప్రజల కోసమే బతుకుతున్నారని తెలిపారు.ఈ మాటలు ఇన్ డైరెక్టుగా తెలంగాణ ప్రభుత్వానికి తాకాయని చెప్పాలి.అంటే ఇప్పటి దాకా వారు మాట్లాడకపోతే కేసీఆర్, షర్మిల కలిసే రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్న కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టేశారన్న మాట.ఈ విధంగా షర్మిలకు ఎలాంటి విమర్శలు రాకుండా చూశారని వైఎస్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
మొత్తానికి ఇన్ డైరెక్టుగా తెలంగాణ మంత్రులకు విజయమ్మ కౌంటర్ బాగానే తాకిందని చెప్పాలి.