ఒక్క సినిమాకే భారీగా డిమాండ్ చేస్తున్న రాములమ్మ...  

vijaya shanthi sarileru nikevvaru - Telugu Tollywood Actress Vijayashanthi News, Tollywood Vijayashanthi News, Vijayashanthi, Vijayashanthi Latest News, Vijayashanthi News, Vijayashanthi Remuneration News

టాలీవుడ్ లో దాదాపుగా అందరి ప్రముఖ హీరోలతో నటించిన టువంటి సీనియర్ హీరోయిన్ రాములమ్మ అలియాస్ విజయశాంతి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.ఈమె సినిమాల్లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోని మంచి అవకాశాలు దక్కించుకుంది.

TeluguStop.com - Vijaya Shanthi Sarileru Nikevvaru

అలాగే ఆ అవకాశాలను వినియోగించుకుంటూ ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అయితే ప్రజలకి సేవ చేయాలనే ఆశయంతో సినిమాలను వదిలిపెట్టి రాజకీయాల వైపు అడుగులు వేసింది.

రాజకీయాల్లో కూడా ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుని సమస్యలపై పోరాడింది రాములమ్మ.

అయితే దాదాపుగా 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మెప్పించింది.

ఈ చిత్రం మంచి బ్లాక్ బాస్టర్ ఇంకా నిలిచి విజయశాంతికి మంచి కం బ్యాక్ చిత్రంగా నిలిచింది.దీంతో దర్శక, నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎగబడుతున్నారు.

ప్రస్తుతం విజయశాంతికి ఉన్న డిమాండ్ ఆధారంగా ఆమె తన పారితోషకాన్ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.దాదాపుగా ఒక చిత్రంలో నటించాలంటే ఆ చిత్రంలో నటిస్తున్నటువంటి హీరోయిన్ కి ఇచ్చే పారితోషకానికి సమానంగా తనకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలని షరతులు పెడుతోందట.అంతేగాక మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలను మాత్రమే చేస్తానని రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా అని ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా లేనని తెగేసి చెబుతోంది రాములమ్మ.దీంతో పలువురు దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

#Vijayashanthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు