పగలు పోరాటం ...రాత్రి కాపురం ఇది బీజేపీ టీడీపీ బంధమా..?  

ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ టీడీపీ పార్టీలు ఒకరి మీద మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ… విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న గుంటూరు సభలో మోదీ టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. చంద్రబాబు కూడా అదే రేంజ్ లో మోదీ .. బీజేపీ మీద విమర్శలు చేసాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే బీజేపీ ని ఇరికించడమే లక్ష్యంగా…ఢిల్లీలో ఏపీ కి ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది కాకపోతే… టీడీపీ బీజేపీ పార్టీలు రెండు పైకి తిట్టుకున్నా… లోపల మాత్రం అంతర్గతంగా… పొత్తు కొనసాగిస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Vijaya Sai Reddy Comented On Bjp Tdp Partys-Hari Babu Tdp And

Vijaya Sai Reddy Comented On Bjp Tdp Partys

దీనికి సాక్ష్యంగా ఒక ఫోటోని కూడా జత చేసి ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టు. ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?’ అంటూ ఫోటోని జత చేసి ట్వీట్ చేసారు. ‘కేంద్రంపై టిడిపి చేసేవి దొంగ దీక్షలనడానికి ఇంత కంటే నిదర్శనమేం కావాలి. పగలంతా పోరాటం, రాత్రి పూట కలిసి కాపురం. సీఎం ఢిల్లీ దీక్షకు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బిజెపి ఎంపీ హరిబాబు కూడా ప్రయాణించాడు. ప్రజలకు అర్థమైంది మీ అనుబంధం!’ అంటూ మరో ట్వీట్ చేసారు.