ఏపీలో సంచలనంగా మారిన విజయ సాయి రెడ్డి ఆడియో టేపులు!  

ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారిన విజయసాయిరెడ్డి ఆడియో టేపులు. .

Vijaya Sai Reddy Audio Tapes Sensational In Ap Politics-sensational In Ap Politics,tdp,vijaya Sai Reddy Audio Tapes,ysrcp

ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలన్నీ ఎవరికీ వారు వ్యూహ, ప్రతి వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావడం ద్వారా సత్తా చాటాలని వైసీపీ అధినేత జగన్ లక్ష్యంతో ఉన్నాడు. అయితే రాజకీయాలలో ఆరితేరిపోయిన చంద్రబాబుని ఎదుర్కొని నిలబడటం అంటే కచ్చితంగా పూర్తి సామర్ధ్యంతో పని చేసి, అతని ఎత్తులకి పై ఎత్తులు వేసేలా ఉండాలి..

ఏపీలో సంచలనంగా మారిన విజయ సాయి రెడ్డి ఆడియో టేపులు!-Vijaya Sai Reddy Audio Tapes Sensational In AP Politics

అయితే చంద్రబాబు రాజకీయాలు, కులాలతో తాను రాజకీయం చేసే విధంగా తండ్రి వైఎస్ నుంచి నేర్చుకోలేకపోయిన జగన్ ఎదురుదాడి తప్ప మరో రాజకీయ వ్యూహాలని ఆలోచించడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆడియో టేపులు ఇప్పుడు రాజకీయాలలో సంచలనంగా మారాయి. చంద్రబాబు దుర్యోధనుడిలాంటివాడు.

చంద్రబాబు అంత తేలికగా లొంగడు, గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. ఏపీ ప్రజలను మనం నమ్మలేం.

అందుకే తెలంగాణలో కేసీఆర్‌ చేసినట్టు ఏపీలో మనం చేయలేం. ఏపీ జనానికి కులాలు ముఖ్యం, కులాల కోసం కొట్టుకుచస్తారు. ఇలాంటి కులాలను హ్యాండిల్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.

మోదీ ఎంత సహకరించినా, ఈసీని ప్రభావితం చేసినా మనకు అనుకూలమని అనుకోవడం సరికాదు. చంద్రబాబు ఆఖరి నిమిషం వరకు పోరాడతాడు. అందుకే ఆఖరి ఓటు పడేవరకు మనం విశ్రమించకూడదు. వైసీపీని సమర్థించే యువతకు ఐక్యూ లేదు.

అందుకే చంద్రబాబుపై గెలుపు సులభమని వారనుకుంటున్నారు. వైసీపీ గెలవాలంటే మోదీ సాయం చేస్తేనో. ఈసీని ప్రభావితం చేస్తేనో సరిపోదు అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడిన ఆడియో టేపులు ఇప్పుడు రాజకీయాలలో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారాయి. మరి వీటిపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు అనేది వేచి చూడాలి.