ఆ వార్తల్లో నిజం లేదు... విజయ్‌ దేవరకొండ సన్నిహితుడు క్లారిటీ  

Vijaya Devarakonda Responds On Gully Boy Remake-

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరో, మోస్ట్‌ క్రేజ్‌ ఉన్న హీరో విజయ్‌ దేవరకొండ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన బాడీలాంగ్వేజ్‌ మరియు మంచి టైమింగ్‌తో డైలాగ్‌ డెలవరీతో యూత్‌ ఆడియన్స్‌ను ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌కు పిచెక్కిస్తున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు...

Vijaya Devarakonda Responds On Gully Boy Remake--Vijaya Devarakonda Responds On Gully Boy Remake-

ఆ తర్వాత కూడా మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యి ఉన్నాడు.ఇలా వచ్చే ఏడాది చివరి వరకు విజయ్‌ దేవరకొండ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘గల్లీ బాయ్‌’ చిత్రంను తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తల్లో నిజం లేదని అధికారిక ప్రకటన వచ్చింది.

Vijaya Devarakonda Responds On Gully Boy Remake--Vijaya Devarakonda Responds On Gully Boy Remake-

విజయ్‌ దేవరకొండ సన్నిహితులు ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఎవరితో కూడా విజయ్‌ దేవరకొండ చర్చలు జరపలేదని, అసలు ఎవరు కూడా ఆ రీమేక్‌తో విజయ్‌ని సంప్రదించలేదు అంటూ ప్రకటించారు.మీడియాలో వస్తున్న వార్తలను ఎవరు నమ్మవద్దని ఈ సందర్బంగా వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మెగా ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి గల్లీ బాయ్‌ చిత్రం రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నాడట.మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తో ఆ రీమేక్‌ను చేయాలని భావిస్తున్నారు.

తేజ్‌ లేదా వరుణ్‌ తేజ్‌తో అయినా సినిమా చేసే అవకాశం ఉంది.మెగా ఫ్యామిలీలోనే ఒకరితో ఆ సినిమా ఉంటుంది తప్ప మరెవ్వరు కూడా ఆ సినిమా చేయబోవడం లేదని మెగా సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.మొత్తానికి దేవరకొండ గల్లీ బాయ్‌ అవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది...