స్ట్రీమింగ్ పార్ట్నర్ ను లాక్ చేసుకున్న విజయ్ 'వారిసు'!

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ సినిమాలంటే కోలీవుడ్ ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి.ఇక ఈయనకు తెలుగులో కూడా కొద్దిగొ గొప్పో మార్కెట్ అయితే ఉంది.

 Vijay Varisu Locks Its Digital Streaming Partner Prime Video Details, Varisu Str-TeluguStop.com

అందుకే తన సినిమాలను డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారు.ప్రెజెంట్ విజయ్ నటిస్తున్న సినిమా ‘వారిసు’.

ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

అలాగే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ కూడా సంచలనం క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.మొదటిసారి విజయ్, రష్మిక జంటగా నటించడం వల్ల ఈ జోడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.ఈ రోజు వరల్డ్ వైడ్ అన్ని చోట్ల రిలీజ్ అయ్యింది.

అయితే తెలుగు వర్షన్ మాత్రం జనవరి 14న రిలీజ్ కాబోతుంది.మరి ఈ సాలిడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అన్ని భాషల్లో కూడా భారీ బిజినెస్ జరుపుకుంది.ఇక ఈ డీల్ లో సినిమా ఓటిటి హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడంతో అఫిషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ పై క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు.కొన్ని నెలల తర్వాతనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube