తెలుగు స్టేట్స్ లో ''వారసుడు'' ఫస్ట్ డే కలెక్షన్స్.. లేటైనా కుమ్మేసిన విజయ్!

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ‘వారసుడు’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

 Vijay Varisu First Day Collections In Telugu States, Rashmika Mandanna, Vamsi Pa-TeluguStop.com

ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ జనవరి 11న తెలుగులో తప్ప మిగిలిన అన్ని చోట్ల గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అక్కడ మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతుంది.

పండుగ సెలవులను విజయ్ సినిమా బాగా క్యాష్ చేసుకుంటుంది.

ఇక తెలుగులో కూడా దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ థియేటర్స్ సమస్య కారణంగా మూడు రోజులు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది.దిల్ రాజు లేటుగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ డే బాగానే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.తెలుగు స్టేట్స్ లో వారసుడు సినిమా మొదటి రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 14న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా పీఆర్ ప్రకారం మొదటి రోజు 3.3 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.మరి ఈ వసూళ్లు డీసెంట్ అనే చెప్పాలి.ఏది ఏమైనా దిల్ రాజు ఎన్నో అడ్డంకులను దాటి ఈ సినిమా తెలుగు వర్షన్ ను రిలీజ్ చేశారు.

లేటుగా అయిన ఈ సినిమా మంచి వసూళ్లనే అందుకుంటుంది.చూడాలి లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube