కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమాకు వారసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది.
విజయ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ లో క్లాస్ గా కనిపించగా సినిమా నుంచి వచ్చిన మరో పోస్టర్ లో విజయ్ కూరగాయల బండిలో పైకి చూస్తూ స్టైలిష్ లుక్ తో కనిపించాడు.
ఈ పోస్టర్ తో మరో విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్.విజయ్ వారసుడు సినిమా రిలీజ్ డేట్ ని ఈ పోస్టర్ తో చెప్పారు చిత్రయూనిట్.
2023 సంక్రాంతికి కానుకగా విజయ్ వారసుడు సినిమా వస్తుంది.ది బాస్ రిటర్న్స్ ట్యాగ్ లైన్ తో విజయ్ వారసుడు సినిమా క్రేజీగా వస్తుంది.
సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీని నిర్మాత దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
విజయ్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకుడు సైతం శభాష్ అనిపించేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది.