సెంటిమెంట్ ఫాలో అవుతున్న దళపతి.. 65వ సినిమా రిలీజ్ కూడా అప్పుడే!

తమిళంలో రజనీ కాంత్ తర్వాత అంత పేరు, ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు దళపతి విజయ్.ప్రస్తుతం విజయ్ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.2021 సంక్రాంతికి విడుదలైన మాస్టర్ సినిమా తో మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు విజయ్.ఈ సినిమా తెలుగులో పర్వాలేదనిపించినా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

 Vijay Thalapathy Following Sentiment In 65 Th Movie Release Date, Vijay Thalapat-TeluguStop.com

అంతేకాదు భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో రికార్డు సృష్టించింది.

ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తన 65 వ సినిమాను ప్రారంభించాడు.ఈ మధ్యనే పూజ కార్యక్రమాల తో ప్రారంభమయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.

Telugu Pongal, Pooja Hegde, Tamil-Movie

ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈయన మొదటి సినిమా నయనతారతో కొలమావు కోకిల అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.ప్రస్తుతం నెల్సన్ శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది.ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు.

ఈ సినిమాలో రాజకీయంగా సాగే సన్నివేశాలే హైలెట్ అని దర్శకుడు చెబుతున్నాడు.

Telugu Pongal, Pooja Hegde, Tamil-Movie

ఈ సినిమాలో దళపతి విజయ్ కు జంటగా మొట్టమొదటి సారిగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరిలో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేయాలనీ విజయ్ భావిస్తున్నాడు.ఈ సినిమాను కూడా విజయ్ కు బాగా అచ్చోచిన పొంగల్ కానుకగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతుంది.

ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube