మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ చేసిన 'విజయ్' !

కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ తలపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రజినీకాంత తర్వాత కోలీవుడ్ లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్.

 Vijay Thalapathy 65 Th Movie First Look Release Date Fix-TeluguStop.com

ఈయన సినిమాలు ప్రజలకు చాలా చేరువగా ఉంటాయి.వాస్తవ సంఘటనల ఆధారంగా ఎక్కువుగా సినిమాలు చేస్తూ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాడు.

సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు.

 Vijay Thalapathy 65 Th Movie First Look Release Date Fix-మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ చేసిన విజయ్’ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్యనే విజయ్ దళపతమాస్టర్‘ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా తెలుగులో పర్వాలేదనిపించినా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

విజయ్ 65 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Telugu 65th Movie, Nelson Dilipkumar, Pooja Hegde, Tamil Star Hero, Vijay And Pooja Hegde, Vijay Thalapathy, Vijay Thalapathy 65 Th Movie First Look Release Date Fix, Vijay Thalapathy 65th Movie Update-Movie

సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.ప్రస్తుతం నెల్సన్ శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది.

ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు.ఈ సినిమాలో రాజకీయంగా సాగే సన్నివేశాలే హైలెట్ అని దర్శకుడు చెబుతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాబోతుంది. జూన్ 22 న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ముందురోజే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుంది.లేటెస్ట్ సమాచారం ప్రకారం జూన్ 21 న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేసారు.మరి ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

#Pooja Hegde #VijayThalapathy #VijayAnd #Tamil Star Hero #VijayThalapathy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు