ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాక్ ఆరోపణల పై ధీటుగా స్పందించిన భారత్  

Vijay Thakur Singh Counter To Pakistan-jammu And Kashmir,pakistan Minister,vijay Thakur Singh, At Un

జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇటీవల ఆర్టికల్ 370 ని రద్దు చేయడం పై పోరుగేదేశం పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో భారత్ పై ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.అంతర్జాతీయ వేదిక పై కూడా భారత్ పై పాక్ తన వక్ర బుద్దిని మాత్రం చూపిస్తుంది.ఈ క్రమంలో పాక్ చేసిన ఆరోపణలకు ఐరాస మానవ హక్కుల మండలి సదస్సు లో భారత్ ధీటుగానే సమాధానం ఇచ్చింది.

Vijay Thakur Singh Counter To Pakistan-jammu And Kashmir,pakistan Minister,vijay Thakur Singh, At Un Telugu Viral News Vijay Thakur Singh Counter To Pakistan-jammu And Kashmir Pakistan Minister Vijay -Vijay Thakur Singh Counter To Pakistan-Jammu And Kashmir Pakistan Minister Vijay At Un

అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసని,ఇలాంటివారు ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటూ ఆరోపించడం విడ్డూరంగా ఉందని భారత్ వ్యాఖ్యానించింది.

Vijay Thakur Singh Counter To Pakistan-jammu And Kashmir,pakistan Minister,vijay Thakur Singh, At Un Telugu Viral News Vijay Thakur Singh Counter To Pakistan-jammu And Kashmir Pakistan Minister Vijay -Vijay Thakur Singh Counter To Pakistan-Jammu And Kashmir Pakistan Minister Vijay At Un

యూఎన్హెచ్ఆర్సీలో భారత్ తరఫున హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ విజయ ఠాకూర్ సింగ్ మాట్లాడారు.ఈ క్రమంలో పాక్ ను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.అలానే జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ అంశమని, భారత అంతర్గత వ్యవహారం కాదంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలను కూడా విజయ్ ఠాకూర్ సింగ్ తోసిపుచ్చారు.

జమ్మూ కాశ్మీర్ విషయం లో భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమాధికార నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని ఆమె కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు.పార్లమెంటులో ఆమోదించిన ఇతర నిర్ణయాల తరహాలోనే కశ్మీర్ విషయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, వాటిలో ఏ దేశం ప్రమేయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ గెజిట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయానికి పాక్ తనదైన శైలి లో విషం చిమ్ముతుంది.కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ భారత్ పై పలు ఆరోపణలు చేస్తుంది.

ఈ క్రమంలో పాక్ కు ఐరాస వేదికగా భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చి స్పష్టం చేసింది.