పండుగలను టార్గట్ చేస్తున్న మాస్టర్.. తగ్గేదే లే!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించే సినిమాలకు ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ముఖ్యంగా తమిళనాట ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో అందరికీ తెలిసిందే.

 Vijay Targets Festivals Next Year, Vijay, Master, Beast, Vamshi Paidipally, Kollywood News-TeluguStop.com

ఇక ఈ హీరో నటించే సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా అంతే ఆసక్తిగా చూస్తుంటాయి.అయితే హీరో విజయ్ మాత్రం తన సినిమాలను పండుగ సీజన్‌లలో రిలీజ్ చేసి తన మార్కెట్ మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ ఏడాదిలో ‘మాస్టర్’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి అదిరిపోయే హిట్ అందుకున్నాడు ఈ హీరో.

 Vijay Targets Festivals Next Year, Vijay, Master, Beast, Vamshi Paidipally, Kollywood News-పండుగలను టార్గట్ చేస్తున్న మాస్టర్.. తగ్గేదే లే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాస్టర్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినా కూడా దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో మనకు తెలిసిందే.

ఇక విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ను కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేయాలని విజయ్ చూస్తున్నాడు.ఈ సినిమాను ఈ దీపావళి లేదా వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను వచ్చే దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాను ఈఏడాది చివరినాటికి ప్రారంభించి వచ్చే దీపావళికి రెడీ చేయాలని విజయ్ చూస్తున్నాడు.

మరి విజయ్ నటిస్తున్న సినిమాలు పండుగ సీజన్‌లో ఎలాంటి విజయాలను అందుకుంటాయో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.ఇక విజయ్ నటించే సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube