ఆయనకు నా ధన్యవాదాలు ! పార్టీ మార్పుపై రాములమ్మ స్పందన ఇలా ?

గత కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతిపై అదే పనిగా వార్తలు వస్తూనే ఉన్నాయి  ఆమె బిజెపి లోకి వెళ్లిపోతున్నారు అని, ఈ మేరకు బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపారని, త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.తెలంగాణ లో సొంత పార్టీ నాయకులే , తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెడుతున్నారని , సభలు, సమావేశాలకు పిలవడం లేదని, ఆమె చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

 Vijay Shanthi Respond On Madhu Yashki Coments,-TeluguStop.com

ఈ వ్యవహారంతో ఆమెపై ఈ విధమైన గాస్సిప్స్ అధికం అయ్యాయి.అయితే ఎక్కడా ఆమె పార్టీ మార్పు విషయమై స్పందించడం కానీ,  తాను కాంగ్రెస్ లోనే ఉంటాను అంటూ గట్టిగా చెప్పక పోవడం,  వంటి కారణాలతో ఆమె బిజెపి లోకి వెళ్లడం ఖాయమని దాదాపు అంతా  ఫిక్స్ అయిపోయారు.

ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయశాంతి పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు.అయినా ఈ రకమైన ప్రచారం జరుగుతుంది.ఈ వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.తాను పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు తనకు వ్యతిరేకంగా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందులో ఏ మాత్రం నిజం లేదని ఆమె వ్యాఖ్యానించారు .తాజాగా ఏ ఐసీసీ మధుయాష్కిగౌడ్ రాములమ్మ పార్టీ మారడం లేదని ఆమె కాంగ్రెస్ లోనే ఉంటారని, ఆమెకు  కొన్ని సమస్యలు ఎదురైన మాట వాస్తవమేనని,ఆ సమస్యలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పరిష్కరిస్తారని చెప్పారు.

మధు యాష్కి వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన విజయశాంతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నాయకులు ఛానల్స్ లో లీకేజ్ ద్వారా నా పై వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారు అని, వాస్తవాలు మాట్లాడిన మధుయాష్కీ గారికి నా ధన్యవాదాలు అంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అయితే నేరుగా విజయశాంతి ఎక్కడా తాను పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ లోనే ఉంటాను అని బహిరంగ ప్రకటన కానీ, క్లారిటీ కానీ ఇవ్వకపోవడంతో ఈ రకమైన గాసిప్స్  వస్తూనే ఉన్నాయి.ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో విజయశాంతి ప్రాధాన్యత పెంచుతారో లేక యధావిధిగా మీ పని మీదే అని వదిలేస్తారో?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube