గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలగిన విజయ్ శంకర్  

Vijay Shankar Out From World Cup 2019 Tourney-india,mayanka Agarwal,out From World Cup,shikar Dhawan,vijay Shankar,ప్రపంచ కప్,బీసీసీఐ బోర్డు

ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కు ఇంగ్లాండ్ జట్టు ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడా తో ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. దీనితో ప్రపంచ కప్ 2019 టోర్నీ లో టీమిండియా జట్టు తోలి ఓటమిని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ కు రెస్ట్ ఇచ్చి రిషబ్ పంత్ కి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ శంకర్ ను ప్రపంచ కప్ నుంచి తప్పించినట్లు తెలుస్తుంది..

గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలగిన విజయ్ శంకర్ -Vijay Shankar Out From World Cup 2019 Tourney

శంకర్ కాలి బొటనవేలి గాయం కారణంగా తనను తప్పిస్తున్నట్లు బీసీసీఐ బోర్డు వర్గాలు తెలిపాయి. దీనితో శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ కు చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రపంచ కప్ లో విజయ్ శంకర్ కు టీమిండియా అవకాశం ఇచ్చినప్పటికీ విజయ్ అంచనాలను అందుకోలేకపోవడం తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పంత్ కు అవకాశం ఇచ్చింది.

అయితే ఈ మ్యాచ్ లో పంత్ 32 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. అయితే కాలి బొటన వేలు గాయం కారణంగా విజయ్ శంకర్ ను ప్రపంచ కప్ నుంచి తప్పిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఇప్పటికే గాయం కారణంగా టీమిండియా టీమ్ నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయ్ శంకర్ కూడా గాయం కారణంగానే ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించాడు.