ఉప్పెనలా వచ్చిన పుకార్లకు చెక్ పెట్టేశారు  

Vijay Setupathi In Uppenashooting Spot-tollywood,vaishnavu Tej,vijay Setupathi

వినూత్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరో తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు.మెగాస్టార్ సైరా సినిమాలో విజయ్ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మెగా యువ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెనలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు...

Vijay Setupathi In Uppenashooting Spot-tollywood,vaishnavu Tej,vijay Setupathi-Vijay Setupathi In UppenaShooting Spot-Tollywood Vaishnavu Tej

గత కొంత కాలంగా ఈ విషయంపై అనేక రకాలుగా వస్తున్న రూమర్స్ కి చిత్ర యూనిట్ చెక్ పెట్టిందనే చెప్పాలి.ఎందుకంటే విజయ్ సినిమాలో నుంచి తప్పుకున్నట్లు అనేక రకాల పుకార్లు వచ్చాయి.స్క్రిప్ట్ నచ్చక చిత్ర యూనిట్ తో విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.ఇక అవన్నీ అబద్ధమని మైత్రి మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పింది.

విజయ్ సేతుపతి ఉప్పెన టీమ్ తో కలిసిన ఫొటోను కూడా రిలీజ్ చేశారు..

Vijay Setupathi In Uppenashooting Spot-tollywood,vaishnavu Tej,vijay Setupathi-Vijay Setupathi In UppenaShooting Spot-Tollywood Vaishnavu Tej

నేడు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పారు.చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించడంతో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు అందరికి క్లారిటీ వచ్చింది.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.